
దేశ జనాభా లో నూటి కి డెబ్భై శాతం మంది రైతులు ,వారికీ అనుభంద రంగానికి చెందినా వారు కాగా మన రాష్ట్ర కేంద్ర పాలకులు మాత్రం మెజారిటీ ప్రజలను వదిలి పెట్టి పది శాతం కూడా లేని మధ్య దళారీల ప్రయోజనం కోసం మాత్రమే పని చేస్తున్నాయి .ఈ పరిస్థితి ఏ ఒక్క సంవత్సరానికి సంభందించినది కాదు ..స్వతంత్రం వచ్చిన నాటి నుండి గత అరవై మూడు సంవత్సరాలు గా ఇదే తంతు .పొలాలలో పండిన పంట కు ఏర్పడే ప్రకృతి సిద్దమైన కరువు కాటకాలు నష్టాల తో పాటు .. పక్షులు పంట ను పాడు చేసే జంతువులు తో పాటు రైతుల కష్టార్జితం ను తార తరాలు గా దళారీలు దోచు కుంటూ నే ఉన్నారు ..రైతులకు గిట్టుభాటు ధరలు కల్పించాలని ఏ నాడు పాలకులు కానీ ..ప్రతిపక్షాలు కానీ ఆలోచించిన సందర్భమే లేదు !కేవలం రైతుకు గిట్టుబాటు ధర లేదు కనకనే ఈ నాడు ఆత్మ హత్యలకు ...ఆర్ధిక కష్టాలకు గురి అవుతూ వస్తున్నారు ..ఇది తరతరాలు గా కొనసాగే దుష్ట సంప్రదాయం గా మిగిలిపోయింది ..రాజికియ పార్టిలు ఎన్నికలప్పుడు మాత్రమే కనపడి ప్రజలకు పడీ పడి దండాలు పెట్టి వోట్లు వేయించుకుని ఆ తర్వాత మొహం చాటేసి ..నాయకులూ హైదరాబాద్,ఢిల్లీ లో సర్వ భోగాలు అనుభవిస్తున్నారు !ఎన్నో ఆకంక్షలతో వోల్ట్లు వేసే రైతులు మాత్రం రోజు రోజు కి క్రుంగి కృశించి పోతున్నారు!అందరికి సంఘాలు ఉన్నాయి.. వారి వారి కష్ట-నష్టాలను ఆ సంఘాలు పరిష్కరించుకుంటాయి అయితే రైతులకు మాత్రం ఎలాంటి సంఘాలు లేవు ..వారి లో ఐక్యత కూడా కానరాదు !అందుకే వారిని ఎవ్వరు పట్టించుకోవడం లేదు !కనీసం వోటు బ్యాంకు గా కూడా వారిని ని గుర్తించడం లేదు ..రాష్ట్రము లో కాంగ్రెస్ ,తెలుగు దేశం రెండు ప్రధాన రాజికియ పార్టిలు గా ఉన్నాయి ఈ రెండు పార్టీలకు వోటు బ్యాంకు లున్నాయి ..రైతుల గురించి పట్టించుకున్న ..పట్టించుకోకపోయిన వారి వోట్లు వరికివస్థాయి ..కొంచెం తగ్గిన గెలుపు కోసం కోట్లు కర్చు పెట్టడానికి ఇరు పార్టిలు సర్వసిద్ధం గా ఉంటాయి .ఇక్కడ కోట్లు వేచిస్తారు ఆ తరువాత వందల కోట్లు సంపాదిస్తారు ..వోట్లు వేసిన రైతులు మాత్రం గత అరవై ఏళ్ళు గా పురోగతి లేకుండా కనీసం తమ ఇంటి పైన చెత్త కూడా వేసుకోలేను స్థితిలో పిల్లని సదివించుకోలేని దుస్థితి లో కొట్టు మిత్తడుతున్నారు ..అధికారాన్ని ఈ రెండు పార్టిలు మార్చి మార్చి పంచుకుంటూ దళారీల కోసమే పరిపాలిస్తూ ..రైతులను క్రమేనా పీల్చి పిప్పి చేస్తున్నారు రేఎనక పగలనక రైతులు కష్ట పడుతుంటే వారి కష్ట అర్జిథాన్ని జలగల్లా దళారీలు జుర్రుకుంటున్న పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు !రైతులు ఆవులను గేదలను మేపి వాటికీ పుష్కలం గా ఆహారాన్ని అందించి రేయిమ్భావాళ్ళు కష్ట పడీ పాలు పితికి అమ్మితే ...ఆవు పాలకు 10-12 రూపాయిలు ఇస్తారు..డైరీ వాళ్ళు అదే పాలను 32 రూపాయిలకు అమ్ముకుంటున్నారు ..రెండు వంతులు రైతుకు ఒక బాగం డైరీ లకు దక్కవలసి ఉండగా ..అది రివర్స్ లో ఉంది ..ఐన పాలకులు పట్టించుకోరు ఒక లీటర్ కు రైతుకు 25 రూపాయిలు వచినా గిట్టుభాటు కానీ పరిస్థితి ...ఈ పాల వ్యాపారం లో రాజికియ పార్టీలకు చెందినా వారు ఉండటం తో ఈ అన్యాయాన్ని అడిగే వారె లేరు!!! లీటర్ నీళ్ళు 14 రూపాయిలకు అమ్ముతున్న పాలకు మాత్రం ఆ ధర కూడా రావడం లేదు !అదే విధం గా ఏ పంట ఉత్పతులు చూసిన రెండు వంతులు దళారీలు కొట్టేస్తున్నారు! కష్ట పడీ పంట పండించిన రైతుకు మాత్రం ఒక వంతు కూడా దక్కడం లేదు! అయిన ఏ ప్రభుత్వమూ ,ఏ నాయకుడు ,ఏ రాజికియ పార్టి పట్టించుకోలేదు పట్టించుకోరు!దీనికి ఒకే ఒక విరుగుడు రైతులంత ఐక్యం గా పోరాటం చెయ్యాల్సిన సందర్భం ఆసన్నం అయింది
పాల ఫ్యాక్టరీలు నడుపుతున్న వారంతా అటు కాంగ్రీస్ ఇటు తెలుగు దేశం నాయకులు,వారికీ సన్నిహితులు ,వారి బందువర్గాలు అంత కలిసి పార్టీలకు అతీతం గా రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు ..
చెరకు పంట ఎలా చేదు ఎక్కిందంటే ....?!
గతం లో చెరకు పండించే రైతులకు దేశ వ్యాప్తం గా ఒకే ధర ఉండేది !ఏనాడూ రైతులకు గిట్టుభాటు ధర కల్పించలేని కేంద్ర ప్రభుత్వం ...గత రెండు మూడు ఏళ్ళు గా ఒక్కో రాష్ట్రము లో ఒక్కో ధర ఇవ్వడం మొదలు పెట్టింది ...గత సంవత్సరం మహారాష్ట్ర లో చెరకు పంట టన్ను కు 2100 రూపాయిలు ఇవ్వడం జరిగింది ...అయితే మన రాష్ట్రము లో మాత్రం కోస్తా లో 1600,రాయలసీమ తెలంగాణాల లో టన్ను కు 1200 రూపాయిలు మాత్రమే ఇచ్చారు ! కేంద్ర ప్రభుత్వం ఇప్పించే ధరల వెత్యాసం కారణం గా రైతులు పంట పండించడం ఏ మానేసారు!!!దాంతో కేంద్రం విదేశాల నుంచి కిలో కు 40 రూపాయిలు వెచ్చించి చక్కెరను దిగుమతి చేసుకునే దుస్థితి కి దిగజారింది ...కష్ట పడి పాడించే మన రైతులకు మొండి చెయ్యి చూపించి విదేశాలకు మాత్రం కోట్లాది రుపయిలను వెచ్చించడం లో ఎంత కమిషన్ దోచుకున్నారో ఆ దేవుడికే తెలియాలి..!
ఈ సంవత్సరం మహారాష్ట్ర లో చెరకు టన్ను కు 2600 రూపాయిలు ఇవ్వడం జరిగింది ...మన రాష్ట్రము లో మాత్రం 2000 రుపయిలను చెల్లించారు .....కంప కట్టే టన్ను 3000 కు అమ్ముతుండగా అందులో సగం కూడా చెరకు పంట కు రావడం లేదు ...అయితే ఇంత అన్యాయం జరుగుతున్నా గత రెండు మూడు ఏళ్ళు గా ఏ రాజికియ పార్టి కానీ నాయకుడు కానీ నిలదీసి ప్రశ్నించిన సందర్బమే లేదు ! ఏ నాడు అసెంబ్లీ లో కానీ పార్లమెంటు లో గాని ప్రభుత్వాలను ఏ నాయకుడు ఈ విషయాన్నీ చర్చించా లేదు! ఒక టన్ను చెరకు పంట పండించాలంటే రైతుకు 2000 రూపాయిలు ఖర్చు అవుతుంది ! అలాంటిది ఖర్చు అయిన సొమ్ము కూడా రైతుకు ఇవ్వకుండా పాలకులు దోబూచులు ఆడటం రాజికియ పార్టిలు మౌనం వహించడం అనేది గత కొన్నేళ్ళు గా చోటు చేసుకుంటోంది ...





No comments:
Post a Comment