skip to main |
skip to sidebar
21వ శతాబ్దం లో అంటారని వారు మన దేశం లో అన్నధతలే అని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దికేక్కరు .భారత ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అన్ని రంగాలు ప్రబుత్వ ఉద్యోగులు ,రాజకీయ వర్గాలు మేధావులు,పత్రికలూ,మీడియా యావత్తు రైతుల ఆశలను సజీవం గ నిలపడం లో విఫలమైయ్యాయి .కనుచూపు మేర లో రైతులకు ఆశరేఖలు కనిపించడం లేదు.కరువులు,వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు తోడు వరుస పంట నష్టాలు ,పంటల భీమ అక్కరకురాకపోవడం ,బ్యాంకుల పరపతి సౌకర్యం పనిక్రనిది కావడం,అధిక వడ్డీలు,పెట్టుబడులలో విపరీతమైన ఖర్చు,కల్తి ఎరువులు ,నకిలీ విత్తనాలు ,ప్రబుత్వరైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతలను అష్టాదిగ్బంధం చేసి ఆత్మహత్యలే శరణ్యం అనేటట్టు శాపిస్తున్నాయి .
ఆత్మహత్యలు :
1995 లో :10719,
1996 లో :13730,
1997 లో :13616,
1998 లో :6010,
1999 లో :16079,
2005 నాటికీ 25017 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు .ఇలా గత 10 ఏళ్ళ లో మూడు లక్షల 35 వేల రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.అయిన పాలకులలో చలనమే లేదు .నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు .
1980 ప్రాంతం లో 150 ఉన్న జీతం 2008 నాటికీ 25 వేల రూపాయిలకు పెరిగి ప్రబుత్వోద్యోగులు తమ సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించుకొగలుగుతున్నారు .అదే సందర్భంధం లో వ్యవసాయ కుటుంబాలు దేశానికి అన్నం పెట్టగలిగే స్థితి నుండి తాము తిండి కోసం వలసలు ,ఆత్మహత్యలకు పాల్పడవలసి వస్తున్నది.
2002 ఏప్రిల్ లో ఎఫ్ .సి .ఐ వద్ద నిల్వున్న బియ్యం ,గోధుమల నిల్వలు 630 లక్షల టన్నులు .ఆ బస్తాలను ఒకదాని పక్కన ఒకటి పెర్చుకుపోతే భూమి నుండి చంద్రమండలానికి తిరిగి భూమికి ఉన్నదూరానికి సరిపోతుందని ప్రణాళిక సంఘ సభ్యులు అమర్త్య సేన్ వ్యాఖ్యానించారు .
2003 లో ఏర్పడిన దుర్బిక్ష పరిశితుల వాళ్ళ ఆ సంవత్సరం 310 లక్షల టన్నుల పంట దిగుబడి తగ్గింది దాంతో ఆహారధాన్యాల నిల్వలు తగ్గిపోయి,దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది .2003 సంవత్సరంలోలాగే దుర్బిక్ష పరిస్థితి ఏర్పడితే దేశం లో ఆహార సంక్షోబం తప్పదు .
వ్యవస్త యోగ్యభూమి 1980-1981 లో 185 మిలియన్ హెక్టార్ల నుండి 2005-06 వచ్చేసరికి 182.5 మిలియన్ హెచ్తరాలకు తగ్గింది .వ్యవసాయేతర భూమి 19.66 మిలియన్ హెక్టార్ల నుండి 29.94 మిలియన్ హెచ్తర్లకు పెరిగింది అయిన పెరిగిన జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తూనే ఉన్నాము.
రైతు జీవితం గానుగ ఎద్దులా మారుతోంది.ఎదుగూ బోదుగు లేని జీవితం గడుపుతూ నిరాశ నిశ్రుహ కు లోనుఅవుతూ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు.దీనివల్ల దేశానికే ఆహారబధ్రత కరువవుతోంది .అంతర్జాతీయ విపణి లో టన్ను బియ్యం 1000 దలర్లుంది .అందుచేత ధన్యం మద్దతు ధర రూ.1800 క్వింటాల్ చొప్పున ఇవ్వాలని భారతరైతుల సమాక్య కేంద్రప్రబుత్వాన్ని 2008 జూన్ నెల లో కోరడం జరిగింది.పెట్టించుకోవడానికి వారికీ తీరిక దొరకాలి గా?
చిన్ని ఉద్యోగి ఆదాయం లో నాల్గో వంతుకుడా పది ఎకరాల రైతుకు అందడం లేదు.రాష్ట్ర ప్రభుత్వాలలో పని చేసే అటెండరు కనీస ఆదాయం నెల కు పదివేల రూపాయిలు .సంవత్సరానికి లక్ష ఇరవై వేలు ఆదాయం వస్తుంది.అయితే దేశానికి తిండి గింజలు పండించే ఒక పెద్ద రైతుకు నెల కు రెండున్నర వేలు కూడా ఆదాయం లబించడం లెదుఇ.దేల్తాప్రంతం లో పది ఎకరాల రైతంటే పెద్ద రైతుగానే చెప్పుకుంటారు అయితే అయన ఆదాయం చూస్తే నెలకు రెండున్నర వేలుకూడా లేదని ఇటివల ఒక పరిశీలనలో వెల్లడైంది .
వ్యవసాయ ఉత్పత్తుల వ్యయం ,ధరల నిర్ణాయక సంఘానికి (c.a.c.p) కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది డా.s.మహేంద్ర దేవ్ ను నియమించిన విషయం తెలిసిందే .అయన ఇటివల గుంటూరు,కృష్ణ,తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలలో పర్యటించి రైతుల స్థితిగతులను ,పంటల ఉత్త్పత్తుల పై పరిశీలన జరిపారు .ఒక ఎకరా ధాన్యం ఉత్త్పత్తికి 14-16 వేలు కర్చవ్తున్నట్టు అయన పరిశీలనలో వెల్లడైంది ఆ మేరకు ప్రతి ఎకరలో ఎంత పంట ఉత్త్పత్తి అవ్తున్నది లెక్కగట్టారు.కనీసం ఒక పంట కు (ఆరు నెలలకు ) 14-16 వేలు కర్చుపెడితే ఎకరాకు సరాసరి 20 quintals ధన్యం ఉత్పత్తి అవ్తున్నది అని తేల్చారు కేంద్రప్రభుత్వం నిర్ణఇంచిన క్వింటాల్ ధాన్యం ధర ఈ ఏడాది 850 రూపాయిలు మాత్రమే అంటే 20 క్వింటాళ్ళ ధాన్యానికి రైతుకు వచ్చేది 17000 మాత్రమే కర్చులు 16 వేలరుపయిలు పోను ఆ రైతులకు మిగిలింది వెయ్యి ,రెండువేలు,దిగుబడి తగ్గి కర్చులు పెరిగినా రైతుకు వచ్చే ఆదాయం లో కోతబడక తప్పదని స్పష్టం అవుతోంది .గత ఏడాది మూడు సంవత్సరాలలో కూలిరెట్లు ,పురుగుమందులు,ఎరువులు,డిజిల్ రెట్లు లాంటి ఉత్పాదక కర్చులు వందశాతం పెరిగాయి .ఆ మేరకి ధాన్యం మద్దతు ధరలు పెరగలేదు.2005 లో అధిక వర్షాలు ,2006 లో ఓగ్ని తూఫాను 2007 ఫిబ్రవరి ,ఏప్రిల్ మధ్య ఒకలా వర్షాలు,2008 లో అధిక వర్షాల కారణం గా కోస్తప్రంతం లో లక్శలదీ ఎకరలో వారి,మినుమ,శనగపంతలు బాగా దెబ్బతిని రైతాంగం కోట్ల రూపాయిలు నష్టపోయారు .కృష్ణ,గోదావరి డెల్ట లలో నారుమల్లలు.ఊడ్చిన వరిచేలు ముంపునకు గురి అయ్యి అపరానస్టటం జరిగింది ఇలాంటి పరిస్థితి లో రైతుల తీవ్ర నిరశానిశ్రుహ లో ఉన్నారు 65 శాతం భూమిని కౌలుదారులు చేస్తున్నారు ఉత్పత్తి కర్చులకు కౌలురెట్లు కూడా కలుపుకుంటే అసలు వచ్చే ధరకు ,ఖర్చులకు పొంతన కుదరకపోగా పెట్టుపడులు కూడా చేతికి వచ్చే అవకాశాలు కనపడటం లేదు .దాంతో సన్నకారు చిన్నకారు రైతులు ప్రకృతి వైపరిత్యాలు ఒక వైపు, చిదపీడలు మరోవైపు గిట్టుబతుధారాలు లేక రైతులు అప్పుల ఊభి లో కూరుకుపోతున్నారు.వ్యవసాయ ఉత్పత్తులు వినియోగదారునికి చేరప్పటికి వంద రూపాయిల వస్తువు మూడు వందల రూపాయిలు చేరిపోతోంది దీనిని నియంత్రించలేని చేతగాని ప్రభుత్వ ఎంత్రంగం రైతుల పై విరుచుపడి ఎగుమతులను నిలిపివేయడం,వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోనివ్వకుండా ఆంక్షలు విదించడం లాంటి చర్యలకు పాల్పడి రైతులను సర్వనాశనం చేసే పనికి పూనుకుంది.గత సంవత్సరం ధాన్యం ధర 760 రూపాయిలు కాగా మిల్లు దగ్గర బియ్యం 1185 రూపాయిలు మాత్రమే!!!!అదే బియ్యం మార్కెట్టు లో 1600 రూపాయిల నుండి 1900 రూపాయిలకు దళారీలు అమ్ముతుంటే నియంత్రించ లేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రత్యేకించి సన్న బియ్యం అయితే 2200-2600 రూపాయిలకు అమ్ముతున్నారు.రైతుకు అందిన ధరతో పోలిస్తే ఈ ధర రెట్టింపు అవ్తుంది కందులు కిలోకు 18 రూపాయిలకు అమ్మారు ..అమ్ముతున్నారు .కూరగాయలు కిలో రూపాయి నుండి మూడు రూప్యిలకు రైతుల నుంచి కొని ,రైతు బజారు లో ఆరు రూపాయిలకు,మార్కెట్టు లో పది రూపాయిలకు అమ్ముతుండగా .రీటైల్ లో 30 రూపాయిలకు అమ్ముతున్నారు .
పెప్సి కంపెనీ తయారు చేసే పెప్సి,లేచిప్స్ లేని పల్లెటూరు లేదు.అనేక మల్టీ నేషనల్ అనుబంధ పరిశ్రమల పేరుతో ప్రభుత్వం కోట్లాది రుపయిలలు రాయితీలు పొంది కొట్లలో లాభాలు ఆర్జిస్తున్నారు.ఆ కంపెనీ c.e.o వార్షిక ఆదాయం 32 కోట్లు కాని వారికీ కావాల్సిన ముడిపదార్థాలు చేసే చేసే చెరకు బంగాల్లడుమ్పల రైతులు ధరలు లేక ఆర్తనాదాలు చేస్తున్నారు
1947-2005 మధ్యకాలం లో భారతదేశం ప్రపంచదేశాలలో ప్రభలమైన ఆర్దిక శక్తి గా ,అగ్రగామిగా అవతరించింది .అయితే రైతాంగం మాత్రం లక్షయభైవేల పైగా ఆత్మహత్యలకు పల్పదవాల్సిన దుర్గతి ఏర్పడింది. దేశం ఎంతో ఎత్తుకు ఎదిగినప్ప్తికి ,దేశానికి అన్నం పెట్టె రైతులు ఆర్దికం గ అట్టడుగున చేరిపోయారు .మన శాస్త్రవేత్తలు రాకెట్లు ,ఉపగ్రహాలను దేశీయ పరిజ్ఞానం తో అబివృద్ది చేసి అతరిక్షం లోకి పంపిస్తున్నారు ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కార్లు రోడ్ల పై పరుగులు తీసుతున్నై మన రైతులు మాత్రం వ్య్వసయపనిముట్లు కోల్పోయారు,ఎద్దులను,ఎద్దుల బండ్లను అన్ని అమ్ముకుని వ్యవసాయం నీర్సిన్చిపాయింది
అత్యంత ప్రతిస్తాత్మకమైన సాంకేతిక విశ్వవిద్యాలయాలు .మేనేజిమెంట్ విశ్వవిధ్యలలలు మన దేశం లో ఉన్నాయ్.అంతేగాక ప్రపంచ స్థాయి ఐదు నక్షత్రాల హోటల్స్ దేశీయం గ అభివృద్ధి చెందాయి అంతర్జాతీయ స్థాయి సమావేశ మందిరాలు అంతర్జాతీయ సౌకర్యాలు కల్గిన విమానాశ్రయాలు అత్యాధునిక ఆసుపత్రులు ప్రపంచ ప్రక్యత వైద్యనిపుణులు అల అన్ని రంగాలలో అభివృద్ధి అయింది .
మన దేశ రైతులు మాత్రం య్వసయంలో నస్టాలపాలై తమ ఉనికినే కోల్పోయే విధం గా,అత్మగౌరావాలను తాకట్లు పెట్టేవిధం గా నగరాలలో రిక్షాలు తొక్కుతూ ,ఆటో నడుపుతూ, అడుక్కుతింటు,అడ్డకూలిలా పనిచేస్తున్నారు.డాక్టర్స్,ఇంజనీర్లు లాంటి వృతి నిపుణులు అమెరికా వంటి అగ్రరాజ్యాలకు వలసలు పోయి డాలర్ల పంట పదిస్తుండగా ,రైతాంగం ఊర్లు పొలాలు వదిలి తిండి కోసం కొటిపట్లు పడుతున్నారు.పిల్లల చదువులకు,పెళ్ళిలకు బలవంతం గ భూములను తకట్టుపెట్టడం ,అమ్మడం చేస్తున్నారు వ్యవసాయం నష్టాల పాలై అప్పుల ఊభి లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు .
పెట్రోల్ ప్రయాణానికి ఉపయోగపడితే ...కొబ్బరి మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం !1970 ప్రాంతం లో ఒక కొబ్బరి కయ అమ్మితే ఒక లీటర్ పెట్రోలు కొన్నుకునే పరిస్థితి ఉండేది !ఇప్పుడు పది కొబ్బరి కాయలు అమ్మిన లీటర్ పెట్రోలు రావడం లేదు.అంటే పెట్రోలు విలువ ఎన్నో రెట్లు పెరిగిన కొబ్బరికాయ విలువ మాత్రం ఎలాంటి మార్పు చోటుచేసుకోవడం లేదు ....అంతే కాదు శీతల పానియాల విషయం లోను అదే వర్తిస్తుంది ..అనేక రసాయనాలతో తయరుయ్యే శీతలపానియలు మొదట్లో 50 పైసలు నుంచి రూపాయి చొప్పున కొబ్బరికాయ రెండు రూపాయిల ధర ఉండేది ఇప్పుడు కొబ్బరి ధర 5 రూపాయిలు కాగా ,శీతల పానియాల ధర 10 నుంచి 15 చొప్పున ఉన్నాయ్ ...శీతలపానియలకన్న మజ్జిగ శ్రేస్తామైనా ,కొబ్బరి నీరు ఎంతో ఉపయోగామైనా వీటి ధరలు అలాగే ఉన్నాయ్.పారిశ్రామిక ఉత్పతులకు పాలకులు ఇస్తున్న విలువ వ్యవసాయ ఉత్పతులకు ఇవ్వకపోవడమే ఈ వ్యత్యాసానికి కారణం గా చెప్పవోచ్చు ....అంతే గాక పారిశ్రామిక ఉత్పతులలో ఉండే సంఘీభావం ప్రలోభాల స్వభావం, వ్యవసాయ ఉత్పతులలో లేకపోవడమే కారణం గ చెప్పొచ్చు !
దేశ జనాభా లో నూటి కి డెబ్భై శాతం మంది రైతులు ,వారికీ అనుభంద రంగానికి చెందినా వారు కాగా మన రాష్ట్ర కేంద్ర పాలకులు మాత్రం మెజారిటీ ప్రజలను వదిలి పెట్టి పది శాతం కూడా లేని మధ్య దళారీల ప్రయోజనం కోసం మాత్రమే పని చేస్తున్నాయి .ఈ పరిస్థితి ఏ ఒక్క సంవత్సరానికి సంభందించినది కాదు ..స్వతంత్రం వచ్చిన నాటి నుండి గత అరవై మూడు సంవత్సరాలు గా ఇదే తంతు .పొలాలలో పండిన పంట కు ఏర్పడే ప్రకృతి సిద్దమైన కరువు కాటకాలు నష్టాల తో పాటు .. పక్షులు పంట ను పాడు చేసే జంతువులు తో పాటు రైతుల కష్టార్జితం ను తార తరాలు గా దళారీలు దోచు కుంటూ నే ఉన్నారు ..రైతులకు గిట్టుభాటు ధరలు కల్పించాలని ఏ నాడు పాలకులు కానీ ..ప్రతిపక్షాలు కానీ ఆలోచించిన సందర్భమే లేదు !కేవలం రైతుకు గిట్టుబాటు ధర లేదు కనకనే ఈ నాడు ఆత్మ హత్యలకు ...ఆర్ధిక కష్టాలకు గురి అవుతూ వస్తున్నారు ..ఇది తరతరాలు గా కొనసాగే దుష్ట సంప్రదాయం గా మిగిలిపోయింది ..రాజికియ పార్టిలు ఎన్నికలప్పుడు మాత్రమే కనపడి ప్రజలకు పడీ పడి దండాలు పెట్టి వోట్లు వేయించుకుని ఆ తర్వాత మొహం చాటేసి ..నాయకులూ హైదరాబాద్,ఢిల్లీ లో సర్వ భోగాలు అనుభవిస్తున్నారు !ఎన్నో ఆకంక్షలతో వోల్ట్లు వేసే రైతులు మాత్రం రోజు రోజు కి క్రుంగి కృశించి పోతున్నారు!అందరికి సంఘాలు ఉన్నాయి.. వారి వారి కష్ట-నష్టాలను ఆ సంఘాలు పరిష్కరించుకుంటాయి అయితే రైతులకు మాత్రం ఎలాంటి సంఘాలు లేవు ..వారి లో ఐక్యత కూడా కానరాదు !అందుకే వారిని ఎవ్వరు పట్టించుకోవడం లేదు !కనీసం వోటు బ్యాంకు గా కూడా వారిని ని గుర్తించడం లేదు ..రాష్ట్రము లో కాంగ్రెస్ ,తెలుగు దేశం రెండు ప్రధాన రాజికియ పార్టిలు గా ఉన్నాయి ఈ రెండు పార్టీలకు వోటు బ్యాంకు లున్నాయి ..రైతుల గురించి పట్టించుకున్న ..పట్టించుకోకపోయిన వారి వోట్లు వరికివస్థాయి ..కొంచెం తగ్గిన గెలుపు కోసం కోట్లు కర్చు పెట్టడానికి ఇరు పార్టిలు సర్వసిద్ధం గా ఉంటాయి .ఇక్కడ కోట్లు వేచిస్తారు ఆ తరువాత వందల కోట్లు సంపాదిస్తారు ..వోట్లు వేసిన రైతులు మాత్రం గత అరవై ఏళ్ళు గా పురోగతి లేకుండా కనీసం తమ ఇంటి పైన చెత్త కూడా వేసుకోలేను స్థితిలో పిల్లని సదివించుకోలేని దుస్థితి లో కొట్టు మిత్తడుతున్నారు ..అధికారాన్ని ఈ రెండు పార్టిలు మార్చి మార్చి పంచుకుంటూ దళారీల కోసమే పరిపాలిస్తూ ..రైతులను క్రమేనా పీల్చి పిప్పి చేస్తున్నారు రేఎనక పగలనక రైతులు కష్ట పడుతుంటే వారి కష్ట అర్జిథాన్ని జలగల్లా దళారీలు జుర్రుకుంటున్న పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు !రైతులు ఆవులను గేదలను మేపి వాటికీ పుష్కలం గా ఆహారాన్ని అందించి రేయిమ్భావాళ్ళు కష్ట పడీ పాలు పితికి అమ్మితే ...ఆవు పాలకు 10-12 రూపాయిలు ఇస్తారు..డైరీ వాళ్ళు అదే పాలను 32 రూపాయిలకు అమ్ముకుంటున్నారు ..రెండు వంతులు రైతుకు ఒక బాగం డైరీ లకు దక్కవలసి ఉండగా ..అది రివర్స్ లో ఉంది ..ఐన పాలకులు పట్టించుకోరు ఒక లీటర్ కు రైతుకు 25 రూపాయిలు వచినా గిట్టుభాటు కానీ పరిస్థితి ...ఈ పాల వ్యాపారం లో రాజికియ పార్టీలకు చెందినా వారు ఉండటం తో ఈ అన్యాయాన్ని అడిగే వారె లేరు!!! లీటర్ నీళ్ళు 14 రూపాయిలకు అమ్ముతున్న పాలకు మాత్రం ఆ ధర కూడా రావడం లేదు !అదే విధం గా ఏ పంట ఉత్పతులు చూసిన రెండు వంతులు దళారీలు కొట్టేస్తున్నారు! కష్ట పడీ పంట పండించిన రైతుకు మాత్రం ఒక వంతు కూడా దక్కడం లేదు! అయిన ఏ ప్రభుత్వమూ ,ఏ నాయకుడు ,ఏ రాజికియ పార్టి పట్టించుకోలేదు పట్టించుకోరు!దీనికి ఒకే ఒక విరుగుడు రైతులంత ఐక్యం గా పోరాటం చెయ్యాల్సిన సందర్భం ఆసన్నం అయింది
పాల ఫ్యాక్టరీలు నడుపుతున్న వారంతా అటు కాంగ్రీస్ ఇటు తెలుగు దేశం నాయకులు,వారికీ సన్నిహితులు ,వారి బందువర్గాలు అంత కలిసి పార్టీలకు అతీతం గా రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు .. చెరకు పంట ఎలా చేదు ఎక్కిందంటే ....?!
గతం లో చెరకు పండించే రైతులకు దేశ వ్యాప్తం గా ఒకే ధర ఉండేది !ఏనాడూ రైతులకు గిట్టుభాటు ధర కల్పించలేని కేంద్ర ప్రభుత్వం ...గత రెండు మూడు ఏళ్ళు గా ఒక్కో రాష్ట్రము లో ఒక్కో ధర ఇవ్వడం మొదలు పెట్టింది ...గత సంవత్సరం మహారాష్ట్ర లో చెరకు పంట టన్ను కు 2100 రూపాయిలు ఇవ్వడం జరిగింది ...అయితే మన రాష్ట్రము లో మాత్రం కోస్తా లో 1600,రాయలసీమ తెలంగాణాల లో టన్ను కు 1200 రూపాయిలు మాత్రమే ఇచ్చారు ! కేంద్ర ప్రభుత్వం ఇప్పించే ధరల వెత్యాసం కారణం గా రైతులు పంట పండించడం ఏ మానేసారు!!!దాంతో కేంద్రం విదేశాల నుంచి కిలో కు 40 రూపాయిలు వెచ్చించి చక్కెరను దిగుమతి చేసుకునే దుస్థితి కి దిగజారింది ...కష్ట పడి పాడించే మన రైతులకు మొండి చెయ్యి చూపించి విదేశాలకు మాత్రం కోట్లాది రుపయిలను వెచ్చించడం లో ఎంత కమిషన్ దోచుకున్నారో ఆ దేవుడికే తెలియాలి..!
ఈ సంవత్సరం మహారాష్ట్ర లో చెరకు టన్ను కు 2600 రూపాయిలు ఇవ్వడం జరిగింది ...మన రాష్ట్రము లో మాత్రం 2000 రుపయిలను చెల్లించారు .....కంప కట్టే టన్ను 3000 కు అమ్ముతుండగా అందులో సగం కూడా చెరకు పంట కు రావడం లేదు ...అయితే ఇంత అన్యాయం జరుగుతున్నా గత రెండు మూడు ఏళ్ళు గా ఏ రాజికియ పార్టి కానీ నాయకుడు కానీ నిలదీసి ప్రశ్నించిన సందర్బమే లేదు ! ఏ నాడు అసెంబ్లీ లో కానీ పార్లమెంటు లో గాని ప్రభుత్వాలను ఏ నాయకుడు ఈ విషయాన్నీ చర్చించా లేదు! ఒక టన్ను చెరకు పంట పండించాలంటే రైతుకు 2000 రూపాయిలు ఖర్చు అవుతుంది ! అలాంటిది ఖర్చు అయిన సొమ్ము కూడా రైతుకు ఇవ్వకుండా పాలకులు దోబూచులు ఆడటం రాజికియ పార్టిలు మౌనం వహించడం అనేది గత కొన్నేళ్ళు గా చోటు చేసుకుంటోంది ...